సమతామూర్తి కేంద్రంలో శాంతి కల్యాణం

సమతామూర్తి కేంద్రంలో శాంతి కల్యాణం

రంగారెడ్డి : శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో ఏర్పాటు చేసిన శ్రీరామనగరంలో శాంతి కల్యాణం కొనసాగుతోంది. చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ఈ క్రతువు కొనసాగుతోంది. సమతామూర్తి సన్నిధిలోని 108 దివ్య దేశాల్లో భారీ ఏర్పాట్ల మధ్య శాంతి కల్యాణం జరుగుతోంది. ఈ క్రతువును తిలకించేందుకు  భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. కల్యాణం సందర్భంగా నిర్వాహకులు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.  భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.