శరద్ పవార్ పార్టీ పేరు ఇదే..

శరద్ పవార్ పార్టీ పేరు ఇదే..

 మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్‌ పవార్‌ కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఎన్సీపీ పార్టీ అజిత్ పవార్ వర్గానిదే అని ఎన్నికల సంఘం చెప్పడంతో శరద్ పవార్ వర్గానికి ‘నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌పార్టీ- శరద్‌చంద్ర పవార్‌’  అనే పేరును ఖరారు చేసింది. త్వరలోనే మహారాష్ట్రలోని ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న వేళ కొత్త పేరు, గుర్తులను ఎంచుకోవాలని ఈసీ సూచించింది. ఎన్నికల కోసం శరద్ పవార్ వర్గం ఈసీకి టీ కప్పు, పొద్దుతిరుగుడు పువ్వు, ఉదయించే సూర్యుడు గుర్తులు పరిశీలించాలని కోరింది. 

మహారాష్ట్ర ఎన్సీపీలో అజిత్ పవార్ చీలిక తెచ్చారు. ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలతో అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నామని ప్రకటించి అధికారంలో భాగస్వామ్యం అయ్యారు. దీంతో ఎన్సీపీలో ఉన్న 53 మంది ఎమ్మెల్యేల్లో మెజారిటీ ఎమ్మెల్యే అజిత్ పవార్ వద్దే ఉండటంతో ఎన్సీపీపార్టీ అజిత్ పవార్ కే చెందుతుందని ఈసీ తెలిపిన విషయం తెలిసిందే.