బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆరంభం

బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆరంభం

నిర్మల్ జిల్లా: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే ఆలయ అర్చకులు..అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. తర్వాత కట్టె పొంగలిని నైవేద్యంగా సమర్పించారు. తొలి రోజులో భాగంగా ఇవాళ అమ్మవారు శైల పుత్రిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.  నవరాత్రి ఉత్సవాలు కావడంతో భక్తులు, భవానీ దీక్షధారులు పెద్దఎత్తున తరలివచ్చి..దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.