
19వ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ కు భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజ క్రీడాకారుడు ఆచంట శరత్ కమల్ క్వాలిఫై అయ్యాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. వరల్డ్ ఛాంపియన్ షిప్ కు అర్హత సాధించడం పట్ల ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు. మెన్స్ సింగిల్స్, డబుల్స్ లో అర్హత సాధించినట్లు శరత్ వెల్లడించాడు. కాగా, మే 20 నుంచి 28 తేదీ వరకు టేబుల్ టెన్నిస్ వరల్డ్ ఛాంపియన్షిప్ సౌత్ ఆఫ్రికాలో జరగనుంది.