శార్దూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీ .. ముంబై 353/9

శార్దూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీ ..  ముంబై 353/9

ముంబై: శార్దూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (105 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 13 ఫోర్లు, 4 సిక్సర్లతో 109) కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలి సెంచరీతో ఆదుకోవడంతో తమిళనాడుతో రంజీ ట్రోఫీ సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముంబై భారీ స్కోరు సాధించింది.  ఆదివారం రెండో రోజు ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముంబై తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 100 ఓవర్లలో 353/9 స్కోరు చేసింది. తనుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొటియాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (74 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), తుషార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాండే (17 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. 45/2 ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన ముంబైని సాయి కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (6/97) వరుస వికెట్లతో దెబ్బతీశాడు.

అతనికి కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2/65) కూడా తోడయ్యాడు. దాంతో, ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (55) హాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీ చేసి ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాగా, మోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవస్తి (2), అజింక్యా రహానె (19), శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (3), శామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ములానీ (0) ఫెయిలయ్యారు. దీంతో ముంబై 106/7 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో శార్దూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. హార్దిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తోమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (35)తో ఎనిమిదో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 105, తనుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తొమ్మిదో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 79 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడించి  ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను చక్కదిద్దాడు. చివర్లో తనుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తుషార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అజేయంగా 63 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జత చేశారు.ప్రస్తుతం ముంబై 207 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతున్నది. తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో తమిళనాడు 146 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది.