స్టాక్ మార్కెట్ ఈరోజు భారీగా పతనమైంది. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ఆసియా మార్కెట్లలో క్షీణతకు దారితీసి, దేశీయ స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. స్టాక్ మార్కెట్ ముగిసీ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1,900 పాయింట్లకు పైగా పడిపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ కూడా 600 పాయింట్లకు పైగా క్షీణించి 1836.57 పాయింట్లు (2.46%) నష్టపోయి 72,696.39 వద్ద ముగిసింది. నిఫ్టీ 601.85 పాయింట్లు (2.6%) నష్టపోయి 22,512.65 వద్ద ముగిసింది. దింతో బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ 14 లక్షల కోట్లు తగ్గి రూ.414.76 లక్షల కోట్లకు పడిపోయింది.
ఏ స్టాక్‌లు అత్యధికంగా పడిపోయాయంటే
సెన్సెక్స్ స్టాక్‌లలో 27 నష్టాలతో ముగిశాయి. టాటా గ్రూప్‌కు చెందిన రెండు స్టాక్‌లు టైటాన్ & ట్రెంట్ 6% కంటే ఎక్కువగా నష్టపోయాయి. అల్ట్రాటెక్ సిమెంట్, బీఈఎల్, టాటా స్టీల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇండిగో, ఏషియన్ పెయింట్స్ కూడా తీవ్రంగా పడిపోయాయి. మరోవైపు, హెచ్‌సిఎల్ టెక్ 2% కంటే పైగా పెరిగింది. పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా కూడా స్వల్ప లాభాలను చూశాయి.
మొత్తంగా బీఎస్‌ఈలో 3,788 స్టాక్‌లు క్షీణించగా, 641 స్టాక్‌లు పెరిగాయి, 127 స్టాక్‌లలో ఎలాంటి మార్పు లేదు. 1,129 స్టాక్‌లు 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో 3,004 స్టాక్‌లు క్షీణించగా, 336 స్టాక్‌లు పెరిగాయి, 80 స్టాక్‌లలో ఎలాంటి మార్పు లేదు. 962 స్టాక్‌లు 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి.
నిఫ్టీ మిడ్‌క్యాప్ 3.69 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 4.16 శాతం పడిపోయాయి. సెక్టార్ల వారీగా చూస్తే, నిఫ్టీ కన్‌స్ట్రక్షన్ డ్యూరబుల్స్ 5 శాతానికి పైగా పడిపోయింది. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ మెటల్ కూడా క్షీణించాయి. ఈరోజు ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 1.23 శాతం పెరిగి, బ్యారెల్‌కు $113.6 వద్ద ట్రేడవుతోంది. ఇక ఈరోజు రూపాయి డాలర్‌తో పోలిస్తే 0.3% క్షీణించి 93.9750 వద్ద కనిష్ట స్థాయికి పడిపోయింది.
