ఆధార్‌‌ను షేర్ చేయడం మానుకోండి

ఆధార్‌‌ను షేర్ చేయడం మానుకోండి

ప్రస్తుతం అన్ని అవసరాలకు ఉపయోగడే ముఖ్యమైన డాక్యుమెంట్ లలో ఆధార్ కూడా ఒకటి. ఆధార్ ఇప్పుడు చాలా వాటికి అవసరం. ఇది లేకపోతే పనులు జరగవనే పరిస్థితి వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయోజనాలు అందాలన్నా.. ఆధార్ కంపల్సరీగా ఉండాల్సిందే. కానీ.. కొంతమంది ఆధార్ కార్డులు జిరాక్స్ పంపించాలంటూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో.. కేంద్ర ప్రభుత్వం పౌరులను అలర్ట్ చేసింది. దుర్వినియోగం కాకుండా ఉండాలంటే.. మాస్క్ కాపీలను మాత్రమే షేర్ చేయాలని సూచించింది. ఆధార్ ఫొటో కాపీని ఏ సంస్థతో కూడా పంచుకోవద్దని.. ఇలా చేస్తే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఆధార్ నెంబర్ లోని చివరి నాలుగు అంకెలను మాత్రమే చూపించే మాస్క్ డ్ ఆధార్ ను ఉపయోగించాలని తెలిపింది. లైసెన్స్ లేని ప్రైవేటు సంస్థలు, హోటల్స్, ఫిల్మ్ థియేటర్లు ఆధార్ కార్డు కాపీలను సేకరించడానికి అనుమతించబడదని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. భారత విశిష్ట గుర్తింపు, వినియోగదారు లైసెన్స్ పొందిన సంస్థలు మాత్రమే ఆధార్ ను ఉపయోగించే వీలుందని వెల్లడించింది. యూఐడీఏఐ (UIDAI) అనుమతి ఉన్న సంస్థలు మాత్రమే ఆధార్ ను ధృవీకరణ కోసం ఉపయోగించుకోవాలని ఆదేశించింది. ఎవరికైనా గుర్తింపు పత్రంలా ఆధార్ ఇవ్వాలని అనుకుంటే... ఈ మాస్క్ డ్ ఆధార్ ఉపయోగపడుతుందని తెలిపింది. 


మాస్క్ డ్ ఆధార్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి ? 

  • UIDAI అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి.. ‘డౌన్ లోడ్ (Download) బటన్ ను క్లిక్ చేయాలి. 
  • ఆధార్ నెంబర్ / ఎన్ రోల్ మెంట్ ఐడీ / వర్చువల్ ఐడీ నెంబర్ ను ఎంట్రీ చేయాలి. 
  • ఆధార్ ను డౌన్ లోడ్ చేసుకొనే ముందు.. మాస్క్ డ్ ఆధార్ టిక్ బాక్స్ ను సెలక్ట్ చేయాలి. తర్వాత వచ్చే క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 
  • సెంట్ ఓటీపీ (OTP) బటన్ ను క్లిక్ చేయాలి. ఆధార్ తో జత చేసిన మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. డౌన్ లోడ్ పై క్లిక్ చేయాలి.
  • పీడీఎఫ్ (PDF) రూపంలో డౌన్ లోడ్ అవుతుంది. దీనికి ఉండే పాస్ వర్డ్ మెయిల్ ద్వారా వస్తాయి.

మరిన్ని వాార్తల కోసం : -
బిహార్ లో భారీ గోల్డ్ మైన్


బోర్డర్ లో పాక్ డ్రోన్ కలకలం