
భద్రాచలం, వెలుగు : వరల్డ్ ట్రైబల్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి కమిషన్ సహకారంతో ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్(ఐఐపీసీ), ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా (పీఏఐ) నిర్వహించిన నేషనల్ ఫొటో ఎగ్జిబిషన్లో భద్రాచలానికి చెందిన ఫొటోగ్రాఫర్ షరీఫ్ తీసిన ఫొటో ట్రైబల్ ఫొటో ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైంది. వరల్డ్ ట్రైబల్ డే సందర్భంగా ఈనెల 9న ఈ అవార్డును ఆయనకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు ఆయనను అభినందించారు.