సలహాలే తీసుకోనోళ్లకు సలహాదార్లు ఎందుకు?: షర్మిల

సలహాలే తీసుకోనోళ్లకు సలహాదార్లు ఎందుకు?: షర్మిల

హైదరాబాద్: చెవిటోని ముందు శంఖం ఊదినట్లు సలహాలు తీసుకోనోడికి సలహాదారులు ఎందుకని వైఎస్సార్  టీపీ చీఫ్ షర్మిల సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. తన నియంత నిర్ణయాలతో తెలంగాణను కేసీఆర్ భ్రష్టు పట్టించాడన్నారు. ప్రజల గోస వినే కమిషన్లకు ఆఫీసర్లు లేరు కానీ దొరకు దోచిపెట్టే సలహాదారులను పక్కన చేర్చుకున్నాడని ఆరోపించారు. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేవు కానీ పక్క రాష్ట్రాల మందికి లక్షలు జీతమిచ్చి మేపుతున్నాడని ఫైర్ అయ్యారు.

సలహాదారులంతా తెలంగాణ ప్రజల సొమ్ముతో జీతాలు  తీసుకుంటూ కేసీఆర్ కు , బీఆర్ఎస్ కు పనిచేస్తున్నారని విమర్శించారు షర్మిల. వీళ్లు రుణమాఫీ అమలు చేయమని సలహా ఇచ్చేవాళ్లా? లక్షా 91 వేల ఉద్యోగాలు భర్తీ చేయమని సలహా ఇచ్చే వాళ్లా? పేదలకు ఇండ్లు కట్టి ఇవ్వమని సలహా ఇచ్చే వాళ్లా? రైతుబీమా అమలు చేయమని సలహా ఇచ్చేవాళ్లా? పోడు పట్టాలు ,నిరుద్యోగ భృతి, ఇవ్వమని సలహా ఇచ్చే వాళ్లా? అని ప్రశ్నాస్త్రాలు సంధించార షర్మిల.