పువ్వాడ అజయ్ కు షర్మిల వార్నింగ్

పువ్వాడ అజయ్ కు షర్మిల వార్నింగ్

ఖమ్మం: పువ్వాడ అజయ్ మంత్రి కాదు కంత్రి అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా పాలేరులో  పర్యటిస్తున్న షర్మిల మాట్లాడుతూ... ప్రజల కోసం తాను ఎర్రటి ఎండలో పాదయాత్ర చేస్తోంటే క్యాట్ వాక్ చేస్తోందని అంటావా అని పువ్వాడ అజయ్ పై ఫైర్ అయ్యారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పిచ్చి కుక్కను కొట్టినట్లు కొడతామని పువ్వాడకు వార్నింగ్ ఇచ్చారు. తన మెడికల్ కాలేజీకి నష్టం కలుగుతుందని భావించి... జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీను రానివ్వడం లేదని పువ్వాడపై నిప్పులు చెరిగారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత సీట్లు ఇస్తామని ఇచ్చావా ? అని నిలదీశారు. బస్టాండ్ ను చూస్తేనే అజయ్ పాలన ఎట్లుందో అర్థమవుతోందని, ఆయన ఆధ్వర్యంలో ఆర్టీసీ మూతపడే పరిస్థితికి వచ్చిందని విమర్శించారు. పువ్వాడ అజయ్, ఆయన అనుచరులు జిల్లాలో భూకబ్జాలకు పాల్పాడుతున్నారని, ప్రశ్నించినవారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. మంత్రి బెదిరింపులకు భయపడే ప్రసక్తిలేదని, వచ్చే ఎన్నికల్లో అజయ్ ను ఓడించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.