నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నరు : షర్మిల

నిరుద్యోగుల జీవితాలతో  ఆడుకుంటున్నరు  : షర్మిల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో  టీఎస్‌‌‌‌పీఎస్సీ ఆడుకుంటున్నదని  వైఎస్ ఆర్టీపీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. ఇందుకు కోర్టులో కమిషన్ ఇచ్చిన వివరణే నిదర్శన మన్నారు. గ్రూప్1 పరీక్షలు ఎంత మంది రాశారో ముందొక లెక్క, ఓఎంఆర్ షీట్స్ లెక్కేస్తే మరో లెక్కట అని శుక్రవారం ఆమె ట్వీట్ చేశారు.  

“ప్రశ్నాపత్రాలను అంగట్లో సరుకుల్లా అమ్ముకున్నోళ్లకు ఓఎంఆర్ షీట్స్ తారుమారు చేయడం ఒక లెక్కనా..?, నిజం గా కమిషన్ పారదర్శకత పాటిస్తే పేపర్లు బయటకు ఎందుకు వచ్చినట్లు..?, ఓసారి పరీక్ష రద్దయిన తర్వాత కూడా మరోసారి ఎందుకు జాగ్రత్తలు తీసుకోనట్లు..?,  బయో మెట్రిక్ విధానం అమలు చేస్తే కమిషన్​కి వచ్చిన నష్టం ఏంటి ..?, పెట్టిన పరీక్షలనే కోర్టు రద్దు చేసిందంటే టీఎస్‌‌‌‌పీఎస్సీ  పారద ర్శకత ఏంటో  అర్థమైంది..!! ”అని షర్మిల పేర్కొన్నారు. 2.33 లక్షల నిరుద్యోగుల గోస ఈ సర్కారుకు తగలకపోదని  హెచ్చరించారు.  టీఎస్‌‌‌‌పీఎస్సీని ప్రగతి భవన్ సర్వీస్ కమీషన్​గా మార్చారని ఫైర్ అయ్యారు.