షర్మిలకు పెద్ద చిక్కే వచ్చిపడిందట.. ఏపీ పాలిటిక్స్ లోకి వెళ్తారా..?

షర్మిలకు పెద్ద చిక్కే వచ్చిపడిందట.. ఏపీ పాలిటిక్స్ లోకి వెళ్తారా..?

విలీనమో, పొత్తో వారంలో తేలుస్తానన్నారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. అటు కాంగ్రెస్..ఇటు షర్మిల తరపున కండీషన్స్ అప్లై అంటున్నారట. షర్మిల కండీషన్స్ లో కొన్నింటికీ కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకుందట. సేమ్ టైమ్ షర్మిలాకు కూడా హైకమాండ్ కండీషన్స్ అప్లై అంటోందట. కొన్నిటికీ షర్మిలా ఓకే చెప్పినా మరికొన్నిటికి ససేమిరా అంటున్నారట. కొన్ని రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. 

షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే పార్టీ బలం మరింత పెరుగుతుందని కొందరు అంటుంటే.. ఎలాంటి ప్రయోజనం ఉండదని మరికొందరు వాదిస్తున్నారట. ఆమె కాంగ్రెస్‌లో చేరినా ఏపీ రాజకీయాల్లోకి వెళ్తారే తప్ప.. తెలంగాణలో ఉండరని మరికొందరు అంటున్నారట. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తెలంగాణ ప్రజలు అమెను అదరిస్తారని ఇంకొందరు డిస్కషన్ చేస్తున్నారట. ఏ నిర్ణయమైనా షర్మిలాపైనే అధారపడి ఉందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారట.

కాంగ్రెస్ పెద్దలు  షర్మిలకు ఒక విచిత్రమైన కండిషన్ పెట్టినట్టు చర్చ జరుగుతోందట. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో పాటు ఏపీ నుంచి ఎంపీగా బరిలో ఉండాలని షర్మిలకు సూచించారంట. రెండు రాష్ర్టాల్లో వైఎస్ క్యాడర్ ఉండటంతో రెండు రాష్ర్టాల్లో కాంగ్రెస్ బలం పెరుగుతుందని పార్టీ పెద్దలు అనుకుంటున్నారట. అక్కడ.. ఇక్కడ రెండు చోట్ల రాజకీయ లబ్ది చేకూరడంతో పాటు షర్మిలకు కూడా రాజకీయంగా కలిసి వస్తుందని షర్మిలకు చెప్తున్నారట. ఇదే విషయంపై అమెతో కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరిపారని సమాచారం. షర్మిల మాత్రం ఇంకా ఓ క్లారిటీకి రాలేదనే టాక్ వినిపిస్తోంది.

ఏపీలో కాంగ్రెస్ బలం పెరగాలంటే తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ షర్మిలను బలమైన లీడర్ గా మార్చాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ఇదే ఇష్యూపై రెండు పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారట.