మహారాష్ట్ర డాక్టర్లకు షారుక్‌ఖాన్‌ సాయం

మహారాష్ట్ర డాక్టర్లకు షారుక్‌ఖాన్‌ సాయం
  • 25వేల పీపీఈ కిట్లు అందజేత
  • థ్యాంక్స్‌ చెప్పిన రాష్ట్ర మంత్రి రాజేశ్‌ తోపే

ముంబై: కరోనాను ఎదుర్కొనేందుకు కష్టపడుతున్న డాక్టర్లకు బాలీవుడ్‌ స్టార్‌‌ షారుక్‌ఖాన్‌ సాయం చేశారు. హెల్త్‌ కేర్‌‌ వర్కర్లకు 2500 పీపీఈ కిట్లు అందించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర హెల్త్‌ మినిస్టర్‌‌ రాజేశ్‌ తోపే ట్విట్టర్‌‌ ద్వారా షారుక్‌కు థ్యాంక్స్‌ చెప్పారు. “ 25వేల పీపీఈ కిట్లు అందించి సాయం చేసిన షారుక్‌ఖాన్‌కు థ్యాంక్స్‌. కరోనాను అరికట్టేందుకు పోరాడుతున్న మా మెడికల్‌ సిబ్బందికి ఇది చాలా పెద్ద సపోర్ట్‌” అని మంత్రి ట్వీట్‌ చేశారు. దీనికి షారుక్‌ఖాన్‌ తిరిగి థ్యాంక్స్‌ చెప్పారు. దీన్ని ఎదుర్కొనేందుకు అందరం కలిసి పనిచేయాలని అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి సాయం చేసేందుకు చాలా మంది ప్రముఖులు ముందుకొచ్చారు. చాలా మంది బాలీవుడ్‌ నటులు ఇప్పటికే పీఎం కేర్‌‌, తదితర సంస్థలకు సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇండియాలో కేసులు 10వేలు దాటగా.. దాంట్లో మహారాష్ట్రలోనే అత్యధికంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2334 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి