శర్వానంద్ హీరోగా శ్రీసు వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇవాళ శుక్రవారం ఆగస్ట్ 14, 2026న మూవీ పూజా కార్యక్రమం ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా (జనవరి 14న) మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ముఖ్యంగా లాంచింగ్ రోజే రిలీజ్ డేట్‌ను ప్రకటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో ‘జార్జ్ క్రిష్’ తొలి అడుగు వేసినట్టైంది.
ఇకపోతే, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బ్లాస్ట్ బ్యూటీ ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటించే అవకాశం ఉంది. త్వరలోనే మేకర్స్ నుంచి క్లారిటీ రానుంది.
THE CELEBRATIONS ARE OFFICIALLY ON! 🔥💥
— AK Entertainments (@AKentsOfficial) August 14, 2026
Presenting our Sankranthi Special ~ #GeorgeKrish ⏳
Charming Star @ImSharwanand in a @SreenuVaitla Film, an @AnilSunkara1 Production. ✨
Fun, flavour & festivities hit the BIG SCREENS on January 14, 2027! 🪁@Kishore_atv @aj_Sunkara… pic.twitter.com/23vZRGSNsv
సంక్రాంతి హిట్‌పై కన్నేసిన శర్వానంద్
శ్రీను వైట్ల తన ట్రేడ్‌మార్క్ కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మేళవింపుతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. చాలా కాలం తర్వాత ఆయన నుంచి వస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. శర్వానంద్‌కు కూడా ఇది కీలక ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు.
►ALSO READ | Hushar Pittalu Review: ‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్స్‌కు పాజిటివ్ టాక్.. అడల్ట్ కామెడీతో వచ్చిన ఈ మూవీ కథేంటి?
కొత్త లుక్, కొత్త క్యారెక్టర్‌తో ఆయన కనిపించనున్నారని సమాచారం. ఇక అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండటంతో ఆల్బమ్పైనా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి, నారీ నారీ నడుమ మురారి చిత్రాలతో సంక్రాంతి బరిలో సూపర్ హిట్స్ అందుకున్న శర్వానంద్.. మరోసారి ఈ సీజన్ లో ‘జార్జ్ క్రిష్’తో వస్తుండటంతో అంచనాలు మొదలయ్యాయి.
THE GRANDEST UNVEIL OF OUR TITLE & RELEASE DATE! 🔥#GeorgeKrish launched in style! ❤️🔥
— AK Entertainments (@AKentsOfficial) August 14, 2026
Charming Star @ImSharwanand 🌟
A @SreenuVaitla Film 🎬
An @AnilSunkara1 Production ✨
Get ready for a SANKRANTHI SPECIAL — IN THEATRES JANUARY 14, 2027! 🪁@Kishore_atv @aj_Sunkara @kvguhan… pic.twitter.com/49G28fWXxd
