23 ఏళ్ల అబ్బాయి డైరెక్ట్ చేసి హీరోగా నటించి హిట్ కొట్టాడంటే నమ్మలేకపోయా: శర్వానంద్

  23 ఏళ్ల అబ్బాయి డైరెక్ట్ చేసి హీరోగా నటించి హిట్ కొట్టాడంటే నమ్మలేకపోయా: శర్వానంద్

కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం  ‘యూత్’. కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హౌస్ ఫుల్ వినీత్, సందీప్  ఈ నెల 26న తెలుగులో విడుదల చేయగా, మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ సక్సెస్ మీట్‌‌‌‌ను నిర్వహించింది. 

అతిథిగా హాజరైన శర్వానంద్ మాట్లాడుతూ ‘తమిళంతోపాటు తెలుగులోనూ ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది.  23 ఏళ్ల అబ్బాయి డైరెక్ట్ చేసి హీరోగా నటించి హిట్ కొట్టాడంటే నమ్మలేకపోయా. వాళ్లలో హానెస్టీ కనిపిస్తోంది. ఇలాంటి మంచి మూవీస్ మరిన్ని చేయాలి’ అని అన్నాడు. ఈ యూత్‌‌‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌ను ఆడియెన్స్ ఆదరిస్తున్నారని దర్శకుడు వశిష్ట చెప్పాడు.  

హీరో, డైరెక్టర్ కెన్ కరునాస్ మాట్లాడుతూ  ‘తెలుగు ఆడియెన్స్ కంటెంట్ ముఖ్యమని మరోసారి ప్రూవ్ చేశారు. మాలాంటి కొత్త వాళ్ల సినిమాను కూడా థియేటర్స్‌‌‌‌లో ఎంజాయ్ చేస్తున్నారు.  ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రశంసలు మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తున్నాయి’ అని అన్నాడు. తమ సినిమాకు హౌస్‌‌‌‌ఫుల్ బోర్డ్స్ చూడటం ఆనందంగా ఉందని నిర్మాతలు అన్నారు.  హీరోయిన్స్ మీనాక్షి,  ప్రియాన్షి యాదవ్, నటుడు చిన్నా, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని పాల్గొన్నారు.