
రెండేళ్ల క్రితం కన్నడ ప్రాంతీయ చిత్రంగా వచ్చిన ‘కాంతార’ చిత్రం పాన్ ఇండియా వైడ్‌గా బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. దీనికి ప్రీక్వెల్‌గా ‘కాంతార ఛాప్టర్ 1’ తెరకెక్కుతోంది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాడు. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. శుక్రవారం ఈ మూవీ ట్రైలర్ అప్‌డేట్‌ను అందించారు మేకర్స్.
సెప్టెంబర్ 22 సోమవారం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో రిషబ్ శెట్టి లుక్ ఆకట్టుకుంటోంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంతో గుల్షన్ దేవయ్య కన్నడ ఎంట్రీ ఇస్తున్నాడు. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. బి.అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.
అక్టోబర్ 2న తెలుగుతోపాటు కన్నడ, తమిళ, మలయాళ, హిందీ, బెంగాళీ, ఇంగ్లీష్‌లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.