శర్వానంద్ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందా? క్లారిటీ వచ్చేసింది

శర్వానంద్ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందా? క్లారిటీ వచ్చేసింది

యంగ్‌ హీరో శర్వానంద్‌ కు ఈ ఏడాది ఆరంభంలో ఎంగేజ్మెంట్ అయినా సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ న్యూస్ సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..  కొంతకాలం క్రితం శర్వానంద్ ఎంగేజ్మెంట్ యూఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్న రక్షితారెడ్డితో జరిగింది.

హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకుకు రామ్‌చరణ్‌, ఉపాసన, సిద్దార్థ్‌, అదితిరావు హైదరీ వంటి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. అయితే.. ఈ ఎంగేజ్‌మెంట్‌ జరిగి దాదాపు ఐదు నెలలు గడిచినా.. ఇంతవరకు వీరు పెళ్లి ఊసెత్తకపోవడంతో ఈ ఎంగేజ్‌మెంట్‌ బ్రేక్‌ అయిందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వార్తలపై  క్లారిటీ ఇచ్చింది శర్వానంద్‌ టీమ్‌. 'శర్వానంద్‌- రక్షితల పెళ్లి ఆగిపోలేదు. వాళ్లిద్దరూ సంతోషంగా ఉన్నారు. శర్వానంద్‌ ప్రస్తుతం శ్రీరామ్‌ ఆదిత్య డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే లండన్‌లో 40 రోజుల షెడ్యూల్‌ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చాడు. తను ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తి చేశాకే పెళ్లిపై పూర్తి స్థాయిలో ఫోకస్‌ చేస్తాడు.

ఇప్పుడతడు సిటీలోనే ఉన్నాడు కాబట్టి ఇరు కుటుంబాలు కలుసుకుని పెళ్లికి మంచి ముహూర్తం ఫిక్స్‌ చేస్తారు. ఆ పెళ్లి తేదీని కూడా అధికారికంగా ప్రకటిస్తాం' అని చెప్పుకొచ్చారు. దీంతో శర్వానంద్ పెళ్లిపై వస్తున్న రూమర్స్ కి చెక్ పడింది