
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్కు ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్లో ముందుగా గుర్తొచ్చేది..రామ్ చరణ్, మంచు మనోజ్, రానా. వీరందరూ ఒకే స్కూల్లో చదువుకుని ఎన్నో బెస్ట్ మెమోరీస్ని సొంతం చేసుకున్నారు.
అయితే, రానా మాత్రం శర్వానంద్,చరణ్ల కంటే సీనియర్ కావడంతో కాస్తా భయపడే వాళ్లమని ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక చరణ్..శర్వానంద్ల స్నేహం..సినిమా ఇండస్ట్రీలోనే కాకూండా బయట రియల్ లైఫ్ లోను ఎంతో గొప్పగా ఉంటుందని చాలా షోస్లో శర్వా తెలిపాడు.
లేటెస్ట్గా హీరో మంచు మనోజ్(Manchu Manoj) హోస్ట్ చేస్తున్న ఉస్తాద్ షో(Ustaad Show)లో..శర్వానంద్(Sharwanand) పాల్గోని చరణ్ స్నేహం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు.
'మెగాస్టార్ చిరంజీవి గారు ఎంత గొప్పవారో, పక్క వాళ్లందరినీ ఎలా చూసుకుంటారో..సేమ్ అలాంటి క్వాలిటీస్..ఎదుటివాళ్ళకు ఇచ్చే ఆ ప్రేమ, ఒక మనిషికి అవసరం వస్తే..దాన్ని గుర్తించి సహాయపడే విధానం కానీ, ఈరోజు నేనిలా ఉన్నా అంటే చరణ్ లాంటి ప్రాణ స్నేహితుడు ఉన్నాడని నేను గర్వంగా చెప్పుకోగలను. చరణ్ లాంటి ఒక ఫ్రెండ్..నాకు ఆ దేవుడు ఇచ్చినందుకు' నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను..అంటూ శర్వా చెప్పుకొచ్చాడు.
ఆ వెంటనే, శర్వా మాటలకు మనోజ్ స్పందిస్తూ..నేను కూడా బాబాయ్..అంటూ చరణ పై ఉన్నస్నేహాన్ని వీరిద్దరు పంచుకున్నారు.ప్రస్తుతం శర్వా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Sharwanand about his best friend Ram Charan ❤️❤️ pic.twitter.com/ogl9gCsp2z
— Royal Charan (@GamechangerRC7) February 9, 2024
ఇక శర్వా సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఆయన యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య(Sriram Aadithya)తో ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి(Krithi shetty) హీరోయిన్గా నటిస్తోంది.