ముందు తాత్కాలిక ప్రెసిడెంట్​ను ఎన్నుకోండి

ముందు తాత్కాలిక  ప్రెసిడెంట్​ను ఎన్నుకోండి

ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించండి: శశిథరూర్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ​అధ్యక్ష పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలనే విషయాన్ని పార్టీ కార్యకర్తలు నిర్ణయిస్తే బాగుంటుందని ఆ పార్టీ సీనియర్​నేత శశిథరూర్​అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆ పోస్టును ఖాళీగా ఉంచకుండా తాత్కాలిక అధ్యక్షుడిని నియమించాలని ఆయన సూచించారు. ఆ తర్వాత పార్టీ ప్రెసిడెంట్​పదవికి ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ప్రెసిడెంట్​పదవితో పాటు పార్టీలో కీలక పదవులకూ అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. పార్టీలో బాధ్యతాయుత వాతావరణం ఏర్పడాలని రాహుల్​గాంధీ చెబుతున్నారని, కార్యకర్తల ఓట్లతో పార్టీ పగ్గాలు చేపట్టిన వ్యక్తి మరింత బాధ్యతాయుతంగా ఉంటారని శశిథరూర్​ చెప్పారు. ఈమేరకు ఈ నెల 10న సీడబ్ల్యూసీ సమావేశం అవుతుందని పార్టీ ప్రకటించిన వెంటనే శశిథరూర్​ స్పందించారు. ఈ మీటింగ్​లో పార్టీకి తాత్కాలిక అధ్యక్షుడిని ఎన్నుకోవాలని కోరారు.