న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ సందర్భంగా పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండాలన్న కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలను ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ నిరాకరించారు. చర్చలో పార్టీ తరఫున లీడ్ తీసుకుని మాట్లాడాలంటూ రాహుల్ గాంధీ ఆఫీసు నుంచి థరూర్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే, హైకమాండ్ అభ్యర్థనను థరూర్ తిరస్కరించారని తెలిపాయి. పార్టీ లైన్ కోసం ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేనని పేర్కొన్నట్లు తెలిసింది.
