కాంగ్రెస్ లో చేరిన శతృఘ్నసిన్హా : ప్రసంగంలో తడబాటు

కాంగ్రెస్ లో చేరిన శతృఘ్నసిన్హా : ప్రసంగంలో తడబాటు

పాట్నా సాహిబ్ ఎంపీ, బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శతృఘ్న సిన్హా కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ హెడ్ ఆఫీస్ లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రణ్ దీప్ సూర్జేవాలా ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతకుముందే.. శతృఘ్న సిన్హా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు.

శతృఘ్న సిన్హా సుదీర్ఘ కాలం బీజేపీలో పనిచేసి.. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, షిప్పింగ్ శాఖల మంత్రిగా పనిచేశారు. 2014లో పాట్నా నుంచి ఎంపీగా గెలిచిన శతృఘ్న సిన్హా … ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలతో విభేదాల కారణంగా కొన్నాళ్లుగా బీజేపీలో రెబల్ గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ టికెట్ కేటాయించకపోవడంతో కాంగ్రెస్ లో చేరారు.

ప్రసంగంలో శతృఘ్న తడబాటు

ఆ తర్వాత ప్రసంగంలో ఆయన తడబడ్డారు. బిహార్ కాంగ్రెస్ చీఫ్ శక్తి సింగ్ గోహిల్… బీజేపీకి వెన్నెముక లాంటివారని అన్నారు. శతృఘ్న తడబడిన సంగతిని రిపోర్టర్లు గుర్తుచేశారు. “ఇవాళ బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం కదా.. ఆ మాత్రం బీజేపీని గుర్తుచేసుకోవాలి. ఏదైనా తప్పుగా చెబితే.. దయచేసి నా మాటల్లోని భావం అర్థం చేసుకోండి. ఆయన కాంగ్రెస్ ను బలోపేతం చేస్తున్నారు” అని వివరణ ఇచ్చారు. తనను బీజేపీలో బాధపెట్టినవారిని క్షమిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఆయన అభిమానులకు ఓ సందేశం ఇచ్చారు.