ఏఐపీటీఎఫ్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్గా షౌకత్ అలీ

ఏఐపీటీఎఫ్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్గా షౌకత్ అలీ

హైదరాబాద్, వెలుగు: అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య (ఏఐపీటీఎఫ్) దక్షిణ భారత దేశ కోఆర్డినేటర్​గా తెలంగాణకు చెందిన సయ్యద్​ షౌకత్​అలీ నియమితులయ్యారు. దక్షిణాది రాష్ట్రాల అనుబంధ సంఘాల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఆయన్ను కోఆర్డినేటర్​గా నియమిస్తూ ఫెడరేషన్​జాతీయ అధ్యక్షుడు సుశీల్ కుమార్ పాండే బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాబోయే మూడేండ్ల పాటు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. సౌత్​ ఇండియా కోఆర్డినేటర్​ హోదాలో ఆయన తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని ఉపాధ్యాయ సంఘాల వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు.  ప్రస్తుతం  ఆయన టీఎస్ పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.