
ఎల్బీనగర్, వెలుగు : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ షీ టీమ్స్ ఏఎస్సై రాజేంద్ర నాథ్ రెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆదివారం మృతి చెందారు. 1993వ బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్ రెడ్డి కొంతకాలంగా ఎల్బీనగర్ డివిజన్ షీ టీమ్స్ ఇన్చార్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గత నెల 11న ఎల్ బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్తుండగా.. నాగోల్ ఫ్లై ఓవర్ పై ఆయన బైక్ స్కిడ్ కావడంతో రోడ్డుపై పడిపోయారు.
రాజేంద్రనాథ్ తలకు తీవ్ర గాయాలు కాగా.. చైతన్యపురి ఇన్ స్పెక్టర్ నాగార్జున సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని హాస్పిటల్‌కు తరలించారు. వారం రోజులుగా హాస్పిటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న రాజేంద్రనాథ్ రెడ్డిని మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు సిటీ న్యూరో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆదివారం ఆయన చనిపోయారు. రాజేంద్రనాథ్ మృతిపై ఉన్నతాధికారులు సంతాపం తెలిపారు.