
హైదరాబాద్, వెలుగు : గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో డీడీలు కట్టిన గొల్లకురుమలకు గొర్రెలు పంపిణీ చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన సీఎస్ శాంత కుమారికి లేఖ రాశారు. రెండో విడత గొర్రెల పంపిణీలో లబ్ధిదారుడి వాటా కింద యూనిట్‌కు రూ.43,750 డీడీలు కట్టించుకున్న గత ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేయలేదన్నారు. రాష్ట్రంలో దాదాపు 82 వేల మంది గొల్లకురుమలు రూ.359 కోట్లు ప్రభుత్వం ఖజానాలో జమ చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీపై సమీక్ష చేసి గొల్ల కురుమల సమస్యలను పరిష్కరించాలని కోరారు.