
కోటగిరి, వెలుగు : బీఆర్ఎస్ లీడర్ల తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ గ్రామానికి చెందిన షేక్ గౌస్బుధవారం నామినేషన్ దాఖలు చేశాడు. పేలాలు అమ్మి బతికే తనకు డబుల్బెడ్రూం ఇల్లు మంజూరు కాగా.. స్థానిక బీఆర్ఎస్ లీడర్లుతనకు ఇల్లు రాకుండా చేశారని ఆరోపించాడు.
పేలాలు అమ్మే నువ్వు ఏం చేయగలవని ఎగతాళి చేయడంతో బాన్సువాడ బరిలో నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. కాగా, బైక్‌కు పేలాల సంచి కట్టుకుని ఎత్తొండ నుంచి కోటగిరి వరకు గౌస్ ర్యాలీ నిర్వహించాడు. అనంతరం బాన్సువాడలో నామినేషన్ వేశాడు. గ్రామానికి చెందిన యువకులు గౌస్ కు మద్దతు తెలిపారు.