ఎమ్మెల్యే చిన్నయ్య, అనుచరులతో నాకు ప్రాణహాని: బాధితురాలు

ఎమ్మెల్యే చిన్నయ్య, అనుచరులతో నాకు ప్రాణహాని: బాధితురాలు

న్యూఢిల్లీ, వెలుగు : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై బాధితురాలు షేజల్ దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఢిల్లీ తెలంగాణ భవన్​లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్యెల్యేకు వ్యతిరేకంగా వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. తమకు న్యాయం జరిగే వరకు జంతర్ మంతర్​లో ధర్నా చేస్తామన్నారు. తనలాగే ఎంతో మంది బాధితులున్నారని, వారందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. ‘‘ఎమ్యెల్యే చిన్నయ్య, అతని అనుచరులతో నాకు ప్రాణహాని ఉంది. ఈ వ్యవహారంలో జాతీయ మహిళా కమిషన్​కు ఫిర్యాదు చేశా. ఎమ్మెల్యే నన్ను లైంగింకంగా వేధించారు. ఆయన మనుషులు చంపేస్తామని బెదిరించారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆరిజిన్ సంస్థను బెల్లంపల్లిలో స్థాపించాం. ఈ కంపెనీ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేలకు వాటా కూడా ఇచ్చాం. ఈ కంపెనీ భూమి వ్యవహారంలో మమ్మల్ని మోసం చేసింది. అంతేకాకుండా తనకు అమ్మాయిలను పంపాలని ఎమ్మెల్యే బ్లాక్ మెయిల్ చేశారు”  అని షేజల్  పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో  తమపై తప్పుడు కేసులు పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు.  తమ గోడును చెప్పుకునేందుకు మంత్రి కేటీఆర్ అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వడం లేదని వాపోయారు.