ఈ డైట్కు షిఫ్ట్ అయితే.. షుగర్ వ్యాధిని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు.. వెయిట్ కూడా తగ్గొచ్చు !

ఈ డైట్కు షిఫ్ట్ అయితే.. షుగర్ వ్యాధిని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు.. వెయిట్ కూడా తగ్గొచ్చు !

షుగర్ ఎంత తియ్యగా ఉంటుందో.. ఆ వ్యాధి వచ్చిన వారి జీవితం అంత చేదుగా తయారవుతుంది. ఏం తినాలన్నా.. ఏం తాగాలన్నా రిస్ట్రిక్షన్స్ తో వేగలేక పోతుంటారు.. అప్పుడప్పుడు రూల్స్ బ్రేక్ చేసి తినేసి.. బ్లడ్ లో చక్కెర పెరిగింది బాబోయ్ అంటూ మళ్లీ హాస్పిటల్స్ బాట పడుతుంటారు. జీవితాంతం నచ్చిన ఫుడ్డుకు దూరంగా ఉండాల్సిందేనా.. మందులు వాడాల్సిందేనా..? అనే విచారంతో కాలం వెళ్లదీస్తుంటారు. కానీ ఎలాంటి మందులు లేకుండా డయాబెటిస్ ను కంట్రోల్ చేయొచ్చంటున్నారు సైంటిస్టులు. 

చక్కెర వ్యాధిని కంట్రోల్ చేసేందుకు వెగాన్ ఫుడ్ కు మారాలంటున్నారు శాస్త్రవేత్తలు. ట్యాబ్లె్ట్స్, ఇంజెక్షన్లు లేకుండా న్యాచురల్ గా తగ్గించే ఉత్తమమైన మార్గాలలో ఇది మొదటి వరుసలో ఉంటుందని చెబుతున్నారు. దీని వలన షుగర్ తగ్గటం, వెయిట్ లాస్ మేనేజ్మెంట్ కోసం సులువైన మార్గం ఇది అని అంటున్నారు. కేవలం 12 నెలలు వేగాన్ డైట్ తీసుకోవడం వలన వచ్చే మార్పుల గురించి వివరించారు. 

వేగాన్ డైట్ అంటే.. యానిమల్ ప్రొడక్ట్స్ లేకుండా ప్లాంట్ బేస్డ్ డైట్.. అంటే జంతు సంబంధిత ఉత్పత్తులు కాకుండా చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తులతో చేసే ఆహారం. 12 వారాలపాటు పండ్లు, కూరగాయలు, బీన్స్ (చిక్కుడు జాతి కూరగాయల), అన్ని రకాల ధాన్యాలు డైట్ లో భాగంగా తీసుకోవటమే వెగాన్ ఫుడ్. ఈ ఫుడ్ తీసుకోవటం వలన 12 రోజులలో దాదాపు 5 కేజీల వెయిట్ తగ్గారట. 

వ్యాయామం, మెడిసిన్ లలో ఎలాంటి మార్పులు లేకుండా ఈ ఫలితాలు సాధించినట్లు పరిశోధనలో తేలింది. హై ఫైబర్ (పీచు పదార్థం), తక్కువ కేలరీలు, లైట్ గా ప్రాసెసింగ్ చేసిన పిండి పదార్ఘాల వలన వెయిట్ తగ్గటం, షుగర్ స్థాయిలు తగ్గటం మంచి రిజల్ట్ అని చెబుతున్నారు. వీటి వలన బ్లడ్ షుగర్ కంట్రోల్ ఉండటంతోపాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గిస్తుందని తెలిపారు. ఎలాంటి డ్రగ్స్, మెడిసిన్ లేకుండా షుగర్ కంట్రోల్ లో ఉండేందుకు ఇప్పుడు చాలా మంది డాక్టర్లు సలహా ఇస్తున్నారు. 

ALSO READ : వానాకాలంలో మష్రూమ్స్ ఎందుకు స్పెషల్.. ఈ వెరైటీస్ రుచి చూస్తే ఇక వద్దన్నా వదలరు.. వండటం వెరీ సింపుల్ !

వెగాన్ ఫుడ్ వలన లాభాలు:

  • ఈ డైట్ లో హై ఫైబర్ ఉండటం వలన ఊబకాయం రాకుండా (లావు కాకుండా) కంట్రోల్ చేస్తుంది. ఈ ఫుడ్ తీసుకోవటం వలన సంతృప్తి కూడా ఎక్కువగా ఉంటుందట.
  • పండ్లు, కూరగాయలలో తక్కువ కేలరీస్ ఉండటం వలన వెయిట్ మెయింటైన్ చేయడం ఈజీ
  • ఈ డైట్ తో ఇన్సులిన్ సెన్సివిటీ ఇంప్రూవ్ అవుతుందని చెబుతున్నారు. అంటే ఇన్సులిన్ అనే హార్మోన్ ను కణాలు తొందరగా స్వీకరిస్తాయి. ఇది షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండేందుకు తోడ్పడుతుంది. 
  • డైట్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన రక్తం లోకి షుగర్ చాలా స్లోగా చేరుతుంది. దీనివలన బ్లడ్ షుగర్ తగ్గేందుకు అవకాశం ఉంటుంది.