శిల్పా చౌదరి కి 2 రోజుల పోలీసు కస్టడీ

V6 Velugu Posted on Dec 02, 2021

కిట్టి పార్టీల పేరుతో అమాయకులను మోసం చేసి కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి కస్టడీ, బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. శిల్పా భర్త శ్రీనివాస్‌ ప్రసాద్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన రాజేంద్రనగర్ కోర్టు .. శిల్పా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అంతేకాదు శిల్పా చౌదరిని 2 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. రేపటి నుంచి రెండు రోజుల పాటు శిల్పా చౌదరి పోలీస్ కస్టడీలో ఉండనుంది.

అధిక వడ్డీల పేరుతో మోసం చేసిన కేసులో శిల్పా చౌదరిని  పోలీసులు అరెస్టు చేశారు. రూ.7 కోట్లు తీసుకొని తిరిగి చెల్లించలేదంటూ శిల్పా చౌదరిపై పలువురు ఫిర్యాదు చేశారు.

Tagged police custody, Two days, remanded, Shilpa Chaudhary

Latest Videos

Subscribe Now

More News