Shilpa Shetty: ఫస్ట్ రూ.60 కోట్లు కట్టండి.. ఆ తర్వాత విదేశాలకు వెళ్ళండి.. శిల్పాశెట్టికి హైకోర్టు షాక్‌

Shilpa Shetty: ఫస్ట్ రూ.60 కోట్లు కట్టండి.. ఆ తర్వాత విదేశాలకు వెళ్ళండి.. శిల్పాశెట్టికి హైకోర్టు షాక్‌

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాలు వ్యాపార పెట్టుబడుల పేరుతో రూ.60 కోట్లకు పైగా మోసం చేశారన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఈ క్రమంలోనే ముంబై పోలీసుల ఆర్థికనేరాల విభాగం (EWO) లుకౌట్‌ నోటీసులు (ఎల్‌వోసీ) జారీ చేసింది. ఇందులో భాగంగా శెట్టి దంపతులు విదేశీ పర్యటనకు వెళ్లడానికి అనుమతి కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 

ఇవాళ బుధవారం (అక్టోబర్ 8న) ఈ పిటిషన్‌పై బాంబే హైకోర్టు విచారణ చేపట్టింది. శెట్టి న్యాయవాది కోర్టుకు విన్నవిస్తూ.. 'శిల్పా శెట్టి దంపతులు విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్' కావాలని కోరారు. ఈ మేరకు కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఒకవేళ శిల్పా శెట్టి దంపతులు విదేశాలకు వెళ్లాలనుకుంటే, రూ.60 కోట్లు డిపాజిట్‌ చేసి వెళ్లొచ్చని కోర్టు వెల్లడించింది. 

అసలేం జరిగిందంటే.. 

వ్యాపారం పేరుతో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా తనను మోసం చేశారని లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కోఠారి ముంబైలోని జుహూ పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు. వ్యాపార విస్తరణ కోసం 2015 నుంచి 2023 మధ్య కాలంలో తాను శెట్టి, కుంద్రాకు చెందిన 'బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్' అనే కంపెనీకి రూ. 60.48 కోట్లు బదిలీ చేశానని పేర్కొన్నారు. అయితే, ఈ నిధులను వ్యాపార విస్తరణకు ఉపయోగించకుండా, ఈ జంట తమ వ్యక్తిగత ఖర్చుల కోసం మళ్లించారని ఆరోపించారు.

►ALSO READ | Rashmika: నా పర్సనల్ లైఫ్ ఎవరికీ తెలీదు.. మీరు వింటున్నవన్నీ ఫేక్ వార్తలే!

పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం..  కోఠారికి రాజ్ కుంద్రాతో ఒక స్నేహితుడి ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో కుంద్రా, శిల్పా శెట్టి ఆన్‌లైన్ షాపింగ్, రిటైల్ ప్లాట్‌ఫారమ్ అయిన 'బెస్ట్ డీల్ టీవీ'లో 87.6% వాటాలను సంయుక్తంగా కలిగి ఉన్నారు. పెట్టుబడిపై ప్రతి నెలా లాభాలను తిరిగి చెల్లిస్తామని, అలాగే అసలు మొత్తాన్ని కూడా తిరిగి ఇస్తామని కుంద్రా కోఠారికి హామీ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే, 2016లో శిల్పా శెట్టి కంపెనీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత, మరో పెట్టుబడిదారుడిని మోసం చేశారనే ఆరోపణలతో కంపెనీపై దివాలా ప్రక్రియలు ప్రారంభించినట్లు కోఠారికి తెలిసిందని తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈఓడబ్ల్యూ పోలీసులు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా,  మరొక వ్యక్తిపై భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 403 (ఆస్తిని అక్రమంగా వినియోగించుకోవడం), 406 ( క్రిమినల్ , నమ్మక ద్రోహం),  34 ( ఉమ్మడి ఉద్దేశం) కింద కేసు నమోదు చేశారు.