నేను తప్పు చేశానంటూ శిల్పా శెట్టి ఇన్‌స్టా పోస్ట్

నేను తప్పు చేశానంటూ శిల్పా శెట్టి ఇన్‌స్టా పోస్ట్

తాను తప్పు చేశానంటూ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ షేర్‌‌ చేసింది. సోఫియా లోరెన్ అనే ఇంగ్లిష్ రచయిత పుస్తకంలో నుంచి ఒక పేజీలో జీవితంలో తప్పుల గురించి రాసిన ఫిలాసఫీని కోట్‌ చేస్తూ ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేసింది. ‘‘మే ఏ మిస్టేక్ బట్ఇట్స్‌ ఓకే” అంటూ యానిమేటెడ్ పోస్ట్ పెట్టిందామె. అలాగే ఆ స్టోరీలో షేర్‌‌ చేసిన బుక్‌లో కోట్‌ అంతా కూడా జీవితంలో తప్పుల గురించే ఉంది.

నేను తప్పులు చేస్తా.. కానీ 

‘‘తప్పులకు జీవితకాలంలో ఎవరైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. అయితే తప్పులు చేయకుంటే జీవితాన్ని అసలు ఇంట్రెస్టింగ్‌ గడపలేం. ఆ తప్పులు ప్రమాదకరంగా ఉండకూడదు. ఇతరులను బాధపట్టేవిగా ఉండకూడదు. అయితే తప్పులు అనేవి లేకుండా ఎవరి జీవితమూ ఉండదు. జీవితంలో తప్పులను మర్చిపోవాల్సిన ఘటనలు గానో లేదా ఇంట్రెస్టింగ్, చాలెంజింగ్ అనుభవాలు గానో చూడాలి. ఎందుకంటే ఆ తప్పులను తప్పులుగా చూడడమే కాకుండా, వాటి నుంచి మనం పాఠాలు నేర్చుకుంటాం” అని ఆ బుక్‌ లోని ఫిలాసఫీ ఉంది. ఆ పేజీలో చివరిగా తాను తప్పులు చేస్తానని, వాటి గురించి తనను తాను క్షమించుకుంటానని, అంతేకాదు వాటి నుంచి తాను పాఠాలు నేర్చుకుంటానని ముగింపు వాఖ్యాలు ఉన్నాయి. పేజీపైన శిల్పా శెట్టి తాను తప్పు చేశానని, కానీ ఫర్లేదని అంటూ ఒక స్టిక్కర్‌‌ను యాడ్ చేసి, స్టోరీ పోస్ట్ చేసింది. 

తన భర్త రాజ్‌కుంద్రా ముంబైలో అమ్మాయిలతో పోర్న్ వీడియోలు తీసి వాటిని పెయిడ్ యాప్స్‌లో పెడుతున్నాడన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన తర్వాతి నుంచి శిల్పా శెట్టి ఇలా తప్పుల గురించి, జీవితం గురించి తరచూ ఇన్‌స్టాలో పోస్టులు పెడుతోంది. ఇటీవలే ‘‘జీవితంలో మనం ఆ క్షణాన్ని అనుభూతి పొందుతూ గడపాలి” అంటూ భర్త అరెస్టు తర్వాత ఫస్ట్ షూటింగ్‌కు వచ్చిన సందర్భంగా పోస్ట్ చేసింది.