సినిమా షూటింగులో కాలు విరగ్గొట్టుకున్న శిల్పా శెట్టి

సినిమా షూటింగులో కాలు విరగ్గొట్టుకున్న శిల్పా శెట్టి

నటీనటులు సినిమా షూటింగుల్లో ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ప్రమాదాలు జరగడం చూస్తూనే ఉంటాం. అదే తరహాలో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కాలికి గాయమైంది. దీంతో ఆమెను హాస్పిటల్ కు తరలించారు. అయితే ఈ గాయానికి కారణం అని ప్రశ్నిస్తే... దానిక్కారణం డైరెక్టరేనంటూ అందరికీ షాకిచ్చింది. ఇక వివరాల్లోకి వెళితే.. శిల్పాశెట్టి ప్రస్తుతం'సుఖి' సినిమాతో పాటు 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' వెబ్ సిరీస్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆమె తన మొదటి వెబ్ సిరీస్‌లో యాక్షన్ పార్ట్ కూడా చేయబోతున్నట్టు సమాచారం. అంయితే ఈ క్రమంలోనే ఆమెకు ఓ యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా కాలికి గాయమైంది. ఈ విషయాన్ని స్వయానే ఆమే సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

రోల్‌, కెమెరా, యాక్షన్‌.. బ్రేక్‌ ఏ లెగ్‌! అని అని డైరెక్టర్ చెప్పినట్టుగానే... తాను కాలు విరగ్గొట్టుకున్నానని చెప్తూ... గాయపడిన కాలుతో.. విక్టరీ సింబల్ ను చూపిస్తూ ఫొటోకు ఫోజిచ్చింది. డైరెక్టర్ చెప్పిన మాటను నేను సీరియస్ గా తీసుకున్నానని.. అందుకే రాబోయే ఆరు వారాల పాటు వర్క్ నుండి సెలవు తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది శిల్పా శెట్టి. త్వరలోనే మళ్లీ ఆరోగ్యంగా తిరిగివాస్తానని.. అప్పటి వరకు నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి అంటూ ఆమె కోరింది. ఈ ప్రార్థనలు ఎల్లప్పుడూ పని చేస్తాయని శిల్పా కామెంట్ చేసింది. 
 

ఒకప్పుడు బాలీవుడ్‌లో బ్యూటీ క్వీన్‌గా పేరు తెచ్చుకొని వరుసగా సినిమాలు చేసింది శిల్పా శెట్టి. కానీ కొంతకాలం తర్వాత వెండితెరపై కనుమరుగయిపోయింది. అదే సమయంలో బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా వ్యవహరించి తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది. చాలాకాలం తర్వాత మళ్లీ శిల్పా శెట్టి.. తనలోని నటిని ప్రేక్షకులకు పరిచయం చేయనుంది. అయితే త్వరలోనే వెబ్ వరల్డ్‌లో కూడా అడుగుపెట్టనుందన్నమాట ఈ భామ.