- తెలంగాణ నుంచి జిష్ణుదేవ్ వర్మ రిలీవ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా బుధ వారం ప్రమాణస్వీకారం చేయను న్నారు. మంగళవారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌కు చేరుకోను న్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ చేతుల మీదుగా కొత్త గవర్నర్ ప్రమాణం చేయనున్నారు.
ఇందుకు లోక్‌భవన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. మరోవైపు, బదిలీపై మహారాష్ట్రకు వెళ్తున్న జిష్ణుదేవ్ వర్మ సోమవారం రిలీవ్ అయ్యారు. బేగంపేట ఎయిర్ పోర్టులో గవర్నర్ దంపతులకు సీఎస్ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన వీడ్కోలు పలికారు.
