శివసేన ఎంపీపై కత్తితో దాడి

శివసేన ఎంపీపై కత్తితో దాడి

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఘటన

ముంబై: శివసేన ఎంపీ ఓమార్జే నింబాల్కర్‌‌‌‌పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. మహారాష్ట్ర కలంబు తాలూకా పడిగోలి నైగాన్‌‌ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ప్రసంగిస్తున్నప్పుడు ఆయనపై దాడి జరిగిందని పోలీసులు చెప్పారు. ఎంపీతో షేక్‌‌ హ్యాండ్‌‌ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన వ్యక్తి కత్తితో పొడిచాడని, రిస్ట్‌‌ వాచ్‌‌ ఉండటం వల్ల దెబ్బ తగల్లేదని చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.