బీజేపీకి అమ్ముడుపోం: ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన ఎమ్మెల్యేల ప్రతిజ్ఙ

బీజేపీకి అమ్ముడుపోం: ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన ఎమ్మెల్యేల ప్రతిజ్ఙ

మహారాష్ట్ర రాజకీయంలో ఓ ఆసక్తికర ఘట్టం జరిగింది. స్కూల్‌లో పిల్లల మాదిరిగా ఎమ్మెల్యేలు చేతులు చాచి.. ప్రతిజ్ఞ చేశారు. తమ బలాన్ని ప్రదర్శించేందుకు ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన ఎమ్మెల్యేలు ముంబైలోని హోటల్ గ్రాండ్ హయత్‌లో సమావేశమయ్యారు. సమాజ్ వాదీ పార్టీ సహా కొంత మంది ఇండిపెండెంట్లు కూడా తమకు సపోర్ట్ చేస్తున్నట్లు ఎన్సీపీ నేతలు చెప్పారు. తమకు మొత్తం 162 మంది ఎమ్మెల్యేల బలం ఉందని తెలిపారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, అశోక్ చవాన్ వంటి ముఖ్యులు దగ్గరుండి ఈ బలప్రదర్శనను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలందరితో ప్రతిజ్ఞ చేయించారు. ‘‘శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, సోనియా గాంధీ నాయకత్వంలో పని చేస్తానని ప్రమాణం చేస్తున్నా. నేను నా పార్టీకి నిజాయితీగా కట్టుబడి ఉంటా. బీజేపీకి అమ్ముడుపోను. బీజేపీ వాళ్లు ఏం ఆశ చూపినా సరే.. వారికి మేలు చేసే పని ఏదీ చేయను’’ అంటూ చేతులు చాచి పెట్టి ప్లెడ్జ్ చేశారు.