V6 News

ISSF‌‌‌‌‌‌‌ జూనియర్‌‌‌‌‌‌‌‌ షూటింగ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో శివ నర్వాల్‌‌‌‌‌‌‌‌కు గోల్డ్‌‌‌‌‌‌‌‌

ISSF‌‌‌‌‌‌‌ జూనియర్‌‌‌‌‌‌‌‌ షూటింగ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో శివ నర్వాల్‌‌‌‌‌‌‌‌కు గోల్డ్‌‌‌‌‌‌‌‌

కైరో: ఐఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ జూనియర్‌‌‌‌‌‌‌‌ షూటింగ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా షూటర్లు అదరగొట్టారు. మెన్స్‌‌‌‌‌‌‌‌ 10 మీటర్ల ఎయిర్‌‌‌‌‌‌‌‌ పిస్టల్‌‌‌‌‌‌‌‌ విభాగంలో శివ నర్వాల్‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ గెలవగా, చిరాగ్‌‌‌‌‌‌‌‌ శర్మ బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకున్నాడు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ 10 మీటర్ల ఎయిర్‌‌‌‌‌‌‌‌ రైఫిల్‌‌‌‌‌‌‌‌ విభాగంలో పనా భుగ్రా రజతం గెలుచుకుంది. దాంతో తొలి రోజే ఇండియా మూడు పతకాలతో బోణీ చేసింది. 

10 మీటర్ల ఎయిర్‌‌‌‌‌‌‌‌ పిస్టల్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో శివ 241.8 పాయింట్లతో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలవగా, సోదిక్జోన్‌‌‌‌‌‌‌‌ అబ్దుల్లావ్‌‌‌‌‌‌‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌) 1.8 పాయింట్ల తేడాతో రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. చిరాగ్‌‌‌‌‌‌‌‌ 218.9 పాయింట్లతో మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అభినవ్‌‌‌‌‌‌‌‌ దేశ్వాల్‌‌‌‌‌‌‌‌ 136.7 పాయింట్లతో ఏడో ప్లేస్‌‌‌‌‌‌‌‌కు పరిమితమయ్యాడు. విమెన్స్‌‌‌‌‌‌‌‌లో భుగ్రా 250.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. శాంభవి క్షీరసాగర్‌‌‌‌‌‌‌‌ (206.5), అన్నీ రాథోడ్‌‌‌‌‌‌‌‌ (164.6) నాలుగు, ఆరో ప్లేస్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టుకున్నారు.