ప్రెసిడెంట్ మీ జేబులో ఉన్నారా?: బీజేపీపై శివసేన ఫైర్

ప్రెసిడెంట్ మీ జేబులో ఉన్నారా?:  బీజేపీపై శివసేన ఫైర్

ప్రెసిడెంట్ మీ జేబులో ఉన్నారా?

బీజేపీ ‘రాష్ట్రపతి పాలన’ కామెంట్స్​పై శివసేన ఫైర్

    బెదిరింపులకు దిగుతున్నారంటూ మండిపాటు

    సామ్నా ఎడిటోరియల్​లో విరుచుకుపడ్డ సేన

     145 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది: సేన

బీజేపీపై ‘మిత్రపక్షం’ శివసేన మరోమారు ఫైర్ అయింది. మహారాష్ట్రలో ఈనెల 7లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే రాష్ట్రపతి పాలన వస్తుందన్న బీజేపీ నేతల కామెంట్లపై తీవ్రంగా స్పందించింది. ‘రాష్ట్రపతి మీ జేబులో ఉన్నారా?’ అంటూ మండిపడింది. రాష్ట్ర ప్రజలను, వారిచ్చిన తీర్పును అవమానించేలా బీజేపీ వ్యవహరిస్తోందంటూ శివసేన పత్రిక సామ్నా ఎడిటోరియల్​లో విరుచుకుపడింది. ‘మహారాష్ర్టకు అవమానం. ప్రెసిడెంట్ మీ జేబులో ఉన్నారా’ అనే టైటిల్​తో ఎడిటోరియల్ పబ్లిష్ చేసింది.

బెదిరించాలని చూస్తున్నారా?

‘‘నవంబర్ 7లోగా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. లేకుంటే రాష్ట్రపతి పాలన వస్తుంది. ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్ల చొప్పున పంచుకుందామంటూ శివసేన పట్టుపట్టడం వల్లే ఆలస్యం జరుగుతోంది…’’ అని ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంటివార్ శుక్రవారం కామెంట్స్ చేశారు. దీనిపై సామ్నాలో సేన మండిపడింది. ‘‘ఇంతకుముందు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలతో నేతలపై దాడులకు దిగినట్లే.. ఇప్పుడు రాష్ర్టపతి పాలన పేరుతో బెదిరింపులకు దిగుతున్నారు” అని ఆరోపించింది. ‘‘సుధీర్ ముంగంటివార్ కామెంట్స్​ను సామాన్య ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి. రాష్ట్రపతి బీజేపీ జేబులో ఉన్నారని అర్థం చేసుకోవాలా? లేక ప్రెసిడెంట్ సీల్ మహారాష్ర్టలోని బీజేపీ ఆఫీసులో ఉందనుకోవాలా? రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే ఆ సీల్ ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధిస్తామని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా?’’ అని ప్రశ్నించింది.

ప్రజల తీర్పును అవమానించడమే

‘‘రాజ్యాంగం, రూల్ ఆఫ్ లాపై కనీస నాలెడ్జ్ లేనివిధంగా ముంగంటివార్ వ్యాఖ్యలు ఉన్నాయి. వారికి కావాల్సింది చేసేందుకు ఇలాంటి బెదిరింపులకు దిగుతున్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రజల తీర్పును అవమానించేలా ఉన్నాయి” అని సామ్నా విమర్శించింది. ‘వచ్చిన సీట్లతో పని లేకుండా.. మేమే పాలన సాగిస్తాం. ఇంకెవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించకూడదు’ అన్నట్లుగా వారి తీరు ఉందని ఆరోపించింది. ప్రభుత్వం ఏర్పాటుపై జరుగుతున్న జాప్యంపై తమను నిందించవద్దని పేర్కొంది. ముంగంటివార్ వ్యాఖ్యలను ఎన్సీపీ కూడా ఖండించింది. ఆయన కామెంట్స్ బెదిరింపుల్లా ఉన్నాయని పేర్కొంది.

సేనకు సపోర్టు చేద్దాం: కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఎంపీ హుస్సేన్‌‌‌‌‌‌‌‌

మహారాష్ట్రలో సర్కార్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయడానికి శివసేనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ సోనియాగాంధీకి ఆపార్టీ రాజ్యసభ ఎంపీ హుస్సేన్‌‌‌‌‌‌‌‌ దాల్వాయ్‌‌‌‌‌‌‌‌ శనివారం లెటర్‌‌‌‌‌‌‌‌ రాశారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ తరఫున ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ కేండిడేట్లుగా పోటీ చేసిన సమయంలో ప్రతిభాపాటిల్‌‌‌‌‌‌‌‌, ప్రణబ్‌‌‌‌‌‌‌‌ ముఖర్జీలకు శివసేన మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆయన ఆ లెటర్లో గుర్తుచేశారు. ‘‘శివసేన, బీజేపీ వేర్వేరు. రాజకీయాల్లో శివసేన అందర్నీ కలుపుకుంటోంది. బీజేపీ అధికారంలోకి రాకుండా చేయాలంటే మనం శివసేనకు సపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేయాలి’’ అని కోరినట్టు దాల్వాయ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ‘‘దాల్వాయ్‌‌‌‌‌‌‌‌ సోషలిస్ట్‌‌‌‌‌‌‌‌ ఐడియాలజీకి చెందినవారు. ప్రోగ్రసివ్‌‌‌‌‌‌‌‌ ముస్లిం కుటుంబం నుంచి వచ్చారు. ఆయన స్టాండ్‌‌‌‌‌‌‌‌కు వెల్‌‌‌‌‌‌‌‌ కమ్‌‌‌‌‌‌‌‌. అయితే ‘కూటమి’గా శివసేన ఎన్నికల్లో పోటీచేసింది. కూటమి ధర్మాన్ని చివరిదాకా పాటిస్తాం’’ అని సంజయ్​రౌత్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.

సోమవారం సోనియాతో పవార్ భేటీ

మహా ప్రతిష్టంభన నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సోమవారం ఢిల్లీలో భేటీ కానున్నారు. శనివారం ఈ విషయాన్ని ఎన్సీపీ నేత అజిత్ పవార్ వెల్లడించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చిస్తారని అధికారికంగా చెబుతున్నా.. మహారాష్ర్టలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి శివసేనకు మద్దతు ఇచ్చే అంశంపైనా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఆదివారం ఢిల్లీ వెళ్లనున్న పవార్.. శనివారం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.

ఏం జరుగుతోంది..?

సీఎం పోస్టును రెండున్నరేళ్లు పంచుకోవాలని శివసేన డిమాండ్ చేస్తోంది. అలాగే మంత్రి పదవులను 50:50 పంచాలని కోరుతోంది.

ఈ రెండు డిమాండ్లకు బీజేపీ ఒప్పుకోవడం లేదు. వచ్చే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా మరోసారి దేవేంద్ర ఫడ్నవీస్ ఉంటారని స్పష్టం చేసింది.

దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న ఇతర మార్గాలను పరిశీలిస్తామని సేన ప్రకటించింది. ఎన్సీపీ, కాంగ్రెస్​తో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించింది.

54 సీట్లు సాధించిన ఎన్సీపీ.. అపోజిషన్​లో కూర్చుంటామని తొలుత వ్యాఖ్యానించింది. శరద్​పవార్​కు ఉద్ధవ్​ థాక్రే ఫోన్ చేసిన నేపథ్యంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.

44 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ.. ‘వెయిట్ అండ్ వాచ్’ ధోరణిలో ఉంది.