శివ్వంపేట, వెలుగు: సీఎం దృష్టికి తీసుకెళ్లి భూ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన మండల పరిధి సికింద్లాపూర్ లో ప్రచారం నిర్వహించారు. పిట్టల వాడ వాసులు తమ భూములు గుంజుకున్నారని, మహిళలు అని చూడకుండా తమపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ సర్పంచ్ కోట్ల రూపాయలు విలువ చేసి ప్రభుత్వ, దేవాదాయ, సీలింగ్ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసి కోట్ల రూపాయలు సంపాదించాడని స్థానికులు ఆరోపించారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థి అరుణ రెడ్డిని గెలిపించాలని, సీఎం దృష్టికి తీసుకెళ్లి భూముల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి అరుణ రెడ్డి, నాయకులు రామచంద్రారెడ్డి, ఆంజనేయులు గౌడ్, వెంకటేశ్, బాబు గౌడ్, రాజు పాల్గొన్నారు.

