దయనీయ స్థితిలో కాంగ్రెస్ : శివరాజ్​సింగ్ చౌహాన్ 

దయనీయ స్థితిలో కాంగ్రెస్ : శివరాజ్​సింగ్ చౌహాన్ 
  • అందుకే సోనియా రాజ్యసభకు వెళ్లారు
  • ఎప్పుడు ఏం చేయాలో తెలియని కెప్టెన్ రాహుల్ అని విమర్శ

భోపాల్: కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశవ్యాప్తంగా దయనీయంగా ఉందని.. చివరకు సోనియా గాంధీ కూడా లోక్​సభకు పోటీచేయకుండా రాజ్యసభ ద్వారా పార్లమెంటుకు వెళ్లారని.. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం భోపాల్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ నిర్ణయాధికారం గందరగోళంగా ఉందని.. లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో పోటీలో నిలిపేందకు కాంగ్రెస్​ పార్టీకి అభ్యర్థులే దొరకడం లేదన్నారు. ‘‘రాహుల్ గాంధీ ఎప్పుడు ఏం చేయాలో తెలియని కెప్టెన్. ఎన్నికలకు రెడీ అవుతున్నప్పుడు యాత్రలకు వెళ్తడు.

యాత్రలు చేయవలసిన టైమ్​లో విదేశాలకు వెళ్తడు. ఓటమి తర్వాత ఈవీఎంల గురించి అరుస్తడు” అని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ దయనీయ పరిస్థితిని చూసి ముందుజాగ్రత్త కలిగిన నేతలు ఆ పార్టీని వీడుతున్నారని చెప్పారు. వరుస ఓటములు చూసి సోనియా గాంధీ కూడా లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించి బ్యాక్‌‌‌‌‌‌‌‌డోర్​లో రాజ్యసభ నుంచి పార్లమెంట్​లో అడుగుపెట్టేంత దారుణంగా ఆ పార్టీ తయారైందని అన్నారు. తాను విదిశ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.