హైదరాబాద్లో ఇలాంటి వెధవలు కూడా ఉన్నారా..? మణికొండలో దారుణ ఘటన

హైదరాబాద్లో ఇలాంటి వెధవలు కూడా ఉన్నారా..? మణికొండలో దారుణ ఘటన

హైదరాబాద్: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ అల్కాపూర్ టౌన్‌షిప్‌లో మహిళ పట్ల ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 14వ తేదీన చంటి బిడ్డతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ వద్దకు వెనుక నుంచి వచ్చిన ఓ యువకుడు అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం. ఈ ఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

మహిళల భద్రతపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. హైదరాబాద్లోని మణికొండ లాంటి ఏరియాలో రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఒక మహిళ తన పిల్లాడిని ఎత్తుకుని నడుచుకుంటూ వెళుతుంటే ఇంత నీచమైన ఘటన జరగడం సభ్య సమాజానికి సిగ్గుచేటు.

►ALSO READ | కనిపించకుండా పోయిన లేడీ సింగర్.. వారం తర్వాత కాలువలో డెడ్ బాడీ !

కొందరు మనుషుల.. మరీ ముఖ్యంగా కొందరు మగాళ్ల మానసిక స్థితి, కామోన్మాదం ఏ స్థాయికి వెళుతుందో, ఎలాంటి దిగజారుడు పనులు చేస్తుందో.. ఈ ఘటన కళ్లకు కట్టింది. ఇలాంటి వాళ్లకు కౌన్సిలింగ్, కొన్ని రోజుల పాటు జైలు శిక్ష సరిపోవని.. కఠినంగా శిక్షిస్తేనే ఇలాంటి ఉన్మాదులకు తగిన బుద్ధి చెప్పినట్లు అవుతుందని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. 

ఆధునిక సమాచార, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, చదువుకున్న వారు, ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువగా ఉండే హైదరాబాబ్ లాంటి మహా నగరంలో ఇలాంటి ఘటన జరగడంపై నగరవాసుల్లో భయాందోళన నెలకొంది.