బాలుడిపై ‘టెర్రర్’ కేసు పాకిస్తాన్‌‌లో షాకింగ్ ఘటన

బాలుడిపై ‘టెర్రర్’ కేసు పాకిస్తాన్‌‌లో షాకింగ్ ఘటన

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గ్వాదర్ పోర్ట్ సిటీలో ఏడేండ్ల బాలుడిపై పోలీసులు యాంటీ-టెర్రరిజం యాక్ట్ (ఏటీఏ) కింద కేసు నమోదు చేశారు. మానవ హక్కుల కార్యకర్త గుల్జార్ దోస్త్ ఇటీవల ప్రభుత్వ వ్యతిరేక ప్రసంగం చేశారు. ఆ వీడియోను బాలుడు టిక్ టాక్ లో షేర్ చేశాడు. 

దాంతో అతనిపై ఉగ్రవాద ఆరోపణలు మోపారు. అంతేగాక,  ఆ చిన్నారిని యాంటీ టెర్రరిజం కోర్టు ముందు హాజరుపర్చారు. ఏడేండ్ల బాలుడిపై టెర్రరిజం సంబంధిత కేసు పెట్టడంపై పాకిస్తాన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (హెచ్ఆర్సీపీ ) మండిపడింది. బలూచిస్తాన్  ప్రావిన్స్‌‌లో బాలల హక్కుల ఉల్లంఘనతోపాటు మానవ హక్కుల ఉల్లంఘన కూడా జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేసింది.