ఇండియన్ షూటింగ్ హిస్టరీలో ఒక తరాన్ని తీర్చిదిద్దిన కోచ్.. జస్పాల్ రాణా మృతి

ఇండియన్ షూటింగ్ హిస్టరీలో ఒక తరాన్ని తీర్చిదిద్దిన కోచ్.. జస్పాల్ రాణా మృతి

భారత షూటింగ్ రంగంలో ఒక తరాన్ని తీర్చిదిద్దిన కోచ్, ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్..  జస్పాల్ రాణా (49) మృతి చెందారు. భారత పిస్టల్ షూటర్లకు హై-పెర్ఫార్మెన్స్ కోచ్‌గా పనిచేస్తున్న రాణా, మ్యూనిచ్‌లో జరిగిన ISSF ప్రపంచ కప్ నుంచి ఇండియాకు తిరిగి వస్తుండగా అస్వస్థతకు గురైన రాణా..  కార్డియాక్ అరెస్టుతో శుక్రవారం (జూన్ 12) మృతిచెందారు. కోచ్ రాణా మృతితో క్రీడా ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగింది. 

మ్యూనిచ్‌లో జరిగిన ISSF ప్రపంచ కప్ నుండి భారతదేశానికి తిరిగి వస్తుండగా కార్డియాక్ అరెస్ట్ అయినట్లు సమాచారం. న్యూఢిల్లీలో దిగిన తర్వాత, సాకేత్‌లోని మాక్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. 
వైద్యులు గుండెలో రక్త ప్రవాహానికి అడ్డంకిని గుర్తించి స్టెంట్ వేశారు. ఇప్పటికి బాగానే ఉంది.. రాబోయే రోజుల్లో రెండో స్టెంట్ వేయాల్సి ఉంటుందని  చెప్పారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని భావించినప్పటికీ.. ఉదయం మృతి చెందడం బాధాకరమైన విషయం.

  • మను భాకర్ ను పారా ఒలింపిక్స్ చేర్చిన కోచ్:

రాణా మరణం భారత షూటింగ్‌కు తీరని లోటు. దేశంలోని గొప్ప గొప్ప షూటర్లలో,  పేరు పొందిన కోచ్ లలో ఆయన ఒకరు. అనేక తరాల పిస్టల్ షూటర్లను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. మను భాకర్‌తో కలిసి చేసిన కృషికి రాణా విస్తృతంగా గుర్తింపు పొందారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మనుభాకర్ ను ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లలో కాంస్య పతకాలు గెలుచుకుని, స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన మొదటి భారతీయ అథ్లెట్‌గా నిలిచారు.

  • ద్రోణాచార్య అవార్డు:

భాకర్‌తో   రాణా సౌరభ్ చౌదరి, అనీష్ భాన్వాలా, చింకీ యాదవ్ వంటి పలువురు ప్రముఖ పిస్టల్ షూటర్లతో కలిసి పనిచేశారు. జూనియర్ ప్రోగ్రామ్‌తో ఆయన పదవీకాలం, అంతర్జాతీయ పోటీలలో భారతదేశానికి నిలకడగా ఫలితాలను అందించిన బలమైన షూటర్లను తయారు చేయడంలో ఆయన కృషి అమోఘం. 

నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) 2025 ఫిబ్రవరిలో రాణాను 25 మీటర్ల పిస్టల్ విభాగానికి హై-పెర్ఫార్మెన్స్ కోచ్‌గా నియమించింది. ఐదు సంవత్సరాల క్రితం, కోచింగ్‌కు ఆయన చేసిన సేవలకు గాను ద్రోణాచార్య అవార్డును అందుకున్నారు.

  •