
హైదరాబాద్లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. మంగళవారం (జూలై15) మలక్ పేట్ లో సీపీఐ నేతపై కాల్పులు జరిపారు గుర్తుతెలియని వ్యక్తులు. పార్కులో వాకింగ్ చేస్తుండగా కంట్లో కారం కొట్టి కాల్పులు జరిపారు. గురిపెట్టి దగ్గరినుంచి కాల్పులు జరపడంతో సీపీఐ నేత చందూనాయక్ అక్కడికక్కడే మృతి చెందారు వివరాల్లోకి వెళితే..
మంగళవారం ఉదయం హైదరాబాద్లోని మలక్ పేట్లో తుపాకీ కాల్పులతో ఉలిక్కిపడింది.శాలివాహన నగర్ లోని పార్క్ లో వాకింక్ చేస్తున్న నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సీపీఐ నేత చందునాయక్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కంట్లో కారం చల్లి నాలుగు రౌండ్స్ కాల్పులకు పాల్పడ్డారు. దీంతో స్పాట్లోనే చందు నాయక్ మృతిచెందారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో అచ్చంపేటకు చందూనాయక్..వామపక్ష నాయకులు. CPI రాష్ట్ర కౌన్సిల్ మెంబర్. మలక్ పేట్ పరిధిలోని మారుతినగర్ లో నివాసం ఉంటున్నారు. చందు నాయక్ మృతి పట్ల షాక్ కు గురయ్యారు కుటుంబ సభ్యులు. మృతదేహం దగ్గర వారి రోదనలు స్థానికులను కలచివేశాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఈఘటనపై విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.