
సంక్రాంతికి రాబోతున్న క్రేజీ సినిమాల్లో మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ఒకటి. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం లాస్ట్ సాంగ్ షూట్ జరుగుతోంది. నెలాఖరుతో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. 28 నాటికి తన వర్క్ కంప్లీట్ చేసి ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌కు వెళ్తారు మహేష్. ఇక జనవరి 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాలని, అదే రోజున ట్రైలర్‌కు కూడా ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
జనవరి 12న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో మరింత వేగంగా ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలని టీమ్ భావిస్తోందట. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, జయరామ్, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న మూడో చిత్రం కావడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి.