విజయ్ దేవరకొండ ఖుషి షూటింగ్ కంప్లీట్

విజయ్ దేవరకొండ ఖుషి షూటింగ్ కంప్లీట్

బ్యాక్ టు బ్యాక్ ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ  బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. తను నటిస్తోన్న చిత్రాల్లో ‘ఖుషి’ ఒకటి. సమంత హీరోయిన్‌‌. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తయిందని శనివారం ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్‌‌ ప్రొడక్షన్ పనులు స్వింగ్‌‌లో జరుగుతున్నాయని తెలియజేశారు మేకర్స్. 

70శాతం పనులు కూడా పూర్తయ్యాయని  చెప్పారు. ఇప్పటికే హిషామ్ అబ్దుల్ వాహబ్ కంపోజ్ చేసిన రెండు పాటలు విడుదలవ్వగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్, సమంత కెమిస్ట్రీ పాటలకు హైలైట్‌‌గా నిలిచింది. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. మరోవైపు దర్శకులు పరశురామ్, గౌతమ్ తిన్ననూరితో చెరో సినిమాలో విజయ్ నటిస్తున్నాడు.