టాలీవుడ్లో బంద్ ఎత్తివేత..సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్స్

టాలీవుడ్లో బంద్ ఎత్తివేత..సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్స్

సెప్టెంబర్ 1 నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ స్టార్ట్ కానున్నాయి. ఈ మేరకు బంద్ ఎత్తేస్తున్నట్లు నిర్మాత్ దిల్ రాజు ప్రకటించారు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత 23 రోజులుగా నిర్మాతలు అన్ని శాఖల తో దిల్ రాజు ఆధ్వర్యంలో చర్చలు జరిపినట్లు  సీ కళ్యాణ్ తెలిపారు. కొన్ని కొన్ని సమస్యలపై చర్చించాల్సి ఉందని..అవి కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయన్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్ లు జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.  ఈలోగా అత్యవసరం అనుకుంటే ఛాంబర్ అనుమతితో షూటింగ్లు మొదలు పెట్టుకోవచ్చన్నారు. 

టికెట్ ధరలు తగ్గిస్తాం..
సినీ పరిశ్రమలోని సమస్యలపై 23 రోజులుగా రోజుకు ఐదారు గంటలు చర్చించుకున్నట్లు ప్రొడ్యూసర్ దిల్ రాజు అన్నారు. -మంగళవారం మూవీ ఆర్టిస్టుల మేనేజర్లతో సమావేశం జరిగిందన్నారు. ఆగస్టు 30న మా తుది నిర్ణయాలు ఫిల్మ్ ఇండస్ట్రీకి వెల్లడిస్తామన్నారు. ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లకు వీపీఎఫ్ సమస్య పరిష్కారమైందని చెప్పారు. -సెప్టెంబర్ 2 నుంచి వీఫీఎఫ్ ఛార్జీలు వసూలు చేయబోమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 1800 థియేటర్లున్నాయన్నారు. టికెట్ ధరలు, తినుబండారాలు అందుబాటు ధరల్లోనే ఉంటాయని తెలిపారు.  పెద్ద సినిమాలకు ఒక శ్లాబ్ ప్రకారం టికెట్ ధరలుంటాయన్నారు. నిర్మాతలు తీసుకున్న నిర్ణయాలు ఎగ్జిబిటర్లకు తాత్కాలికంగా ఇబ్బంది కలిగిస్తుందని చెప్పారు. 



ఓటీటీలో సినిమాలపై..
ఓటీటీలో సినిమాల విడుదలపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు దిల్ రాజు చెప్పారు. థియేటర్లలో విడుదలైన తర్వాత 8 వారాలకు లేదంటే 50 రోజుల తరువాతే ఓటిటిలో రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.  ఇప్పటికే ఓటీటీలతో అగ్రిమెంట్ చేసుకున్న మూవీలకు మాత్రం ఈ రూల్ వర్తించదన్నారు.  మిగిలిన సినిమాల విషయంలో ఈ నిబంధన పాటించాలన్నారు.

టాలీవుడ్లో బంద్ ఎత్తేయడంతో...నిర్మాతలు షూటింగ్స్కు సిద్దమవుతున్నారు. ఇప్పటికే 'పుష్ప2' సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించగా..త్వరలో మహేష్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కూడా మొదలుకానుంది. లోకల్ లో సెప్టెంబర్ 1 నుంచి, ఫారెన్ లొకేషన్స్లో అయితే ఆగస్టు 25 నుంచే షూటింగ్స్ మొదలయ్యే అవకాశం ఉంది.