షాపింగ్ మాల్ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన 12 మంది..

షాపింగ్ మాల్ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన 12 మంది..

హైదరాబాద్ లోని ఓ షాపింగ్ మాల్ లిఫ్ట్ లో 12 మంది ఇరుక్కుపోయారు. సాంకేతిక సమస్య కారణంగా లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. 12 మంది లిఫ్ట్ ఎక్కిన   కొన్ని నిమిషాల్లోనే ఒక్కసారిగా లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో వారంత భయాందోళనకు గురయ్యారు. ఇరుక్కుపోయిన వారిలో ఓ గర్భిణి కూడా ఉంది. అయితే లిఫ్ట్ తెరవడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు. ఈ ఘటన మలక్ పేటలోని ఓ షాపింగ్ మాల్ కాంప్లెక్స్ లో జరిగింది. 

లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన వారు షాపింగ్ కాంప్లెక్స్ నిర్వాహకులకు  సమాచారం అందించారు. దీంతో  షాపింగ్ క్లాంప్లెక్స్ నిర్వాహకులు మలక్ పేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న దీంతో అగ్ని మాపక సిబ్బంది..లిఫ్ట్ తలుపులు తెరిచి వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.