ఢిల్లీలో కాలేజీలు, యూనివర్శిటీల కొరత ఉంది: సీఎం కేజ్రీవాల్

ఢిల్లీలో కాలేజీలు, యూనివర్శిటీల కొరత ఉంది: సీఎం కేజ్రీవాల్

ఢిల్లీలో కాలేజీలు, యూనివర్శిటీల కొరత చాలా ఎక్కువగా ఉన్నదన్నారు సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ చెప్పారు. దీంతో అక్కడి విద్యార్థులందరికీ కాలేజీల్లో అడ్మిషన్లు దొరకడం కష్టంగా మారిందన్నారు.  విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా అందుకు తగినట్టుగా కాలేజీలు,వర్శిటీలు పెరగడంలేదన్నారు. అందుకే అడ్మిషన్ల కటాఫ్‌ ఎక్కువగా ఉంటున్నదని చెప్పారు.  ఢిల్లీకి మరిన్ని కాలేజీలు, యూనివర్శిటీలు అవసరంమన్నారు కేజ్రీవాల్.

ఢిల్లీలో కొత్త కాలేజీలు ఏర్పాటు కాకపోవడానికి పాత కాలం నాటి  ఢిల్లీ యూనివర్శిటీ చట్టమే కారణమని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఆ యాక్ట్ ప్రకారం ఢిల్లీలో కొత్త కాలేజీని స్థాపించాలంటే ఢిల్లీ యూనివర్శిటీ పర్మిషన్ తప్పనిసరని ఆయన చెప్పారు. అందుకే ఢిల్లీలో కొత్త కాలేజీలు, యూనివర్శిటీలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ఢిల్లీ వర్శిటీ యాక్టుకు సవరణలు చేయాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రికి లేఖ రాసిట్లు తెలిపారు కేజ్రివాల్‌.