పంజాబ్-హర్యానా హైకోర్టు తీర్పు : భర్తను చంపిన భార్యకు పెన్షన్ ఇవ్వాల్సిందే

పంజాబ్-హర్యానా హైకోర్టు తీర్పు : భర్తను చంపిన భార్యకు పెన్షన్ ఇవ్వాల్సిందే

చండీగఢ్: ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్తను చంపి నా.. భార్యకు పెన్షన్ ఇవ్వాల్సిందేనని పంజాబ్–హర్యానా హైకోర్టు తీర్పు చెప్పింది. ‘ఫ్యామిలీ పెన్షన్​కు అర్హురాలైతే భార్యకు పెన్షన్ ఇవ్వాలి. ఫ్యామిలీ పెన్షన్ అనేది వెల్ఫేర్ స్కీమ్. ప్రభుత్వ ఉద్యోగి చని పోతే అతనిపై ఆధారపడిన కుటుంబానికి ఆర్థికసాయం అందించేందుకు దీన్ని తీసుకొచ్చారు. భర్త హత్య కేసులో దోషిగా ఉన్నా.. భార్యకు పెన్షన్ ఇవ్వాల్సిందే’నని హైకోర్టు కామెంట్ చేసింది. హర్యానాలోని అంబాలాకు చెందిన బల్జీత్ కౌర్ వేసిన పిటిషన్​పై హైకోర్టు ఈ తీర్పు చెప్పింది. తన భర్త తర్సెమ్ సింగ్ ప్రభుత్వ ఉద్యోగి అని, 2008లో చనిపోయాడని, 2009లో తనపై మర్డర్ కేసు బుక్ అయిందని, 2011లో కోర్టు దోషిగా తేల్చిందని పిటిషన్ లో పేర్కొంది. దీంతో పెన్షన్ నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషన్​లో పేర్కొంది.  దీని పై విచారించిన పంజాబ్–హర్యానా హైకోర్టు హర్యానా గవర్నమెంట్ ఉత్తర్వులను తోసిపుచ్చింది. బకాయిలతోపాటు 2 నెలల్లోగా పిటిషనర్​కు పెన్షన్ రిలీజ్ చేయాలని ఆదేశించింది. సీసీఎస్ (పెన్షన్) రూల్స్, 1972 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి భార్య పెన్షన్​కు అర్హురాలని చెప్పింది. రెండో పెళ్లి చేసుకున్నా.. పెన్షన్  ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.

For More News..

నేటి నుంచి రేషన్‌కు బయోమెట్రిక్ బంద్