నా భర్త రెండో పెండ్లి ఆపించాలి .. పోలీసులను ఆశ్రయించిన భార్య

నా భర్త రెండో పెండ్లి ఆపించాలి ..  పోలీసులను ఆశ్రయించిన భార్య

ఘట్ కేసర్, వెలుగు: తన భర్త మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని, వెంటనే ఆపించాలని ఓ డాక్టర్‌‌‌‌ పోలీసులను ఆశ్రయించింది. పోచారం ఐటీసీ ఇన్‌‌ స్పెక్టర్‌‌‌‌ రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌‌కు చెందిన డెంటిస్ట్‌‌ శోభారాణికి హనుమకొండలోని భవానినగర్‌‌‌‌ కు చెందిన సందీప్‌‌ చౌహాన్‌‌తో 2009లో వివాహం జరిగింది. వీరికి 2011లో కూతురు జన్మించగా, అప్పటి నుంచి భర్త సందీప్‌‌ అదనపు కట్నం తేవాలని ఆమెను వేధిస్తున్నాడు. తట్టుకోలేకపోయిన శోభారాణి ఇప్పటివరకు రూ.50 లక్షలు ఇచ్చింది. 

అయినా భర్త నుంచి వేధింపులు ఆగలేదు. పెద్దల సమక్షంలో పంచాయితీలు నిర్వహించినా, సందీప్‌‌ తీరు మారలేదు. దీంతో శోభారాణి తన కూతురుతో కలిసి కరీంనగర్‌‌‌‌లోని తండ్రి వీరభద్రయ్య వద్ద ఉంటోంది. అయితే సందీప్‌‌ ఈనెల 24న మరో యువతిని పెండ్లి చేసుకుంటున్నట్లు సమాచారం అందుకున్న శోభారాణి శుక్రవారం కూతురు, తండ్రి వీరభద్రయ్యతో కలిసి అన్నోజిగూడలో సందీప్‌‌ ఇంటికి వెళ్లింది. భార్య, కూతురు, మామపై దాడిచేసిన సందీప్ అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో బాధితురాలు పోచారం ఐటీసీ పోలీసులను ఆశ్రయించింది.