కాలేజీ విద్యార్థులకు ఫీజులను పూర్తిగా చెల్లించాలె : ఆర్ కృష్ణయ్య

కాలేజీ విద్యార్థులకు ఫీజులను పూర్తిగా చెల్లించాలె : ఆర్ కృష్ణయ్య

కాలేజీ విద్యార్థులకు స్కాలర్ షిప్ లను రూ. 5500 నుండి రూ.20 వేలకు పెంచాలని రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న బీసీ విద్యార్థుల ఫీజులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు బడ్జెట్ లో ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన రూ.6300 కోట్లను రూ.20వేల కోట్లకు పెంచాలన్నారు. కాలేజీ విద్యార్థులకు ఫీజులను పూర్తిగా చెల్లించాలన్న ఆయన్న... ప్రభుత్వం బీసీ వ్యతిరేక చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ బీసీలకు బడ్జెట్ పెంచుతానని చెప్పారు కానీ పెంచలేదని తెలిపారు. హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను కూడా రూ.1500 నుంచి రూ.3 వేలకు.. పాఠశాల, గురుకుల విద్యార్థుల మెస్ ఛార్జీలు రూ.900 నుండి 3 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో గురుకుల బీసీ గురుకుల పాఠశాలను మంజూరు చేయాలని కోరారు.

 ప్రభుత్వం కొన్ని భూములను హైదరాబాద్ లో వేలం పెడుతుంటే మరికొందరు కబ్జా చేస్తున్నారని ఆర్ క-ృష్ణయ్య ఆరోపించారు. మంత్రి కేటీఆర్ పురపాలక శాఖకు న్యాయం చేస్తున్నాడన్న ఆయన.. అందుకు ఆయన్ను తాను అభినందిస్తున్నానన్నారు. రాష్ట్రంలో 290 కాలేజీ హాస్టల్స్ ఉన్నాయని, కానీ ఒక్కదానికీ సొంత భవనం లేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ టెంపుల్ బడ్జెట్ కేటాయించడం సంతోషమే.. కానీ బీసీ హాస్టల్స్ కూడా కేటాయించాలని కోరారు. అంతకుముందు హాస్టల్ స్టూడెంట్స్ మెస్ ఛార్జీలు పెంచాలని కోరుతూ బీసీ సంఘం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో  ఖైరతాబాద్ లోని బీసీ వెల్ఫేర్,  మంత్రి గంగుల కమలాకర్ కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడి చేశారు. వారికి మద్దతు తెలుపుతూ ఆర్ కృష్ణయ్య కూడా ముట్టడిలో పాల్గొన్నారు.